Comments On KCR: మెదక్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (Comments On KCR) అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై కేసు నమోదు చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎస్పీని ప్రశ్నిస్తూ.. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను విడిచిపెట్టి, ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారని నిలదీశారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తన వ్యాఖ్యలను నాలుగైదు రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే, ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, అలాగే హైకోర్టు.. మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) తలుపులు తట్టామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.
Also Read: IPL 2025 Purple Cap Table: ఐపీఎల్ 2025లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ వీరులు వీరే!