Imran Can Be Poisoned : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య బుష్రా బీబీ (49) ఆందోళన వ్యక్తం చేశారు. తోషాఖానా కేసులో అరెస్టయి పంజాబ్ ప్రావిన్సులోని అటక్ జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె అన్నారు. ఇమ్రాన్ పై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగిన ఘటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. గతంలో హత్యాయత్నం చేసిన వారిని ఇప్పటికీ అరెస్టు చేయనందున, ఇమ్రాన్ ప్రాణాలకు ఇంకా ప్రమాదం పొంచి ఉందన్నారు. విషప్రయోగం జరిగే ముప్పు ఉన్నందున.. ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు ఇమ్రాన్ కు అనుమతి ఇవ్వాలని బుష్రా బీబీ కోరారు.
Also read : World Mosquito Day: దోమలపై యుద్ధానికి తొలి అడుగు సికింద్రాబాద్ నుంచే.. తెలుసా ?
70 ఏళ్ల వయసులో ఉన్న తన భర్త ఇమ్రాన్‌కు సామాజిక, రాజకీయ హోదా దృష్ట్యా జైలులో బి-క్లాస్ సౌకర్యాలు కల్పించాలని బుష్రా బీబీ విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ను అటక్ జైలు నుంచి మెరుగైన వసతులున్న మరో జైలుకు తరలించాలని కోరారు. ఈమేరకు పంజాబ్ హోంశాఖ కార్యదర్శికి ఆమె లేఖ (Imran Can Be Poisoned) రాశారు. ఇమ్రాన్‌ను అటక్ జైలు నుంచి రావల్పిండిలోని అదియాలాకు తరలించాలంటూ సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించిన విషయాన్ని బుష్రా బీబీ గుర్తు చేశారు.ఇమ్రాన్‌కు మూడో భార్య అయిన బుష్రా బీబీ సూఫీయిజం అనుసరించే ఇస్లామిక్ ఆధ్యాత్మికవేత్త.
Also read : Next Stop Moon : “చంద్రయాన్-3” నెక్స్ట్ స్టాప్ చంద్రుడి దక్షిణ ధృవమే.. ఫైనల్ డీబూస్టింగ్ సక్సెస్ ఫుల్