Uniform Civil Code: UCC అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసినంత సులువు కాదు

యూనిఫాం సివిల్ కోడ్ అనేది 370ని రద్దు చేసినంత సులువు కాదన్నారు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్. యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్

Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్ అనేది 370ని రద్దు చేసినంత సులువు కాదన్నారు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్. యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడం అనేది ఆర్టికల్ 370ని రద్దు చేసినంత ఈజీ కాదని చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ అన్ని మతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. అందులో అన్ని మతాల ప్రమేయం ఉంది. ముస్లింలే కాదు, క్రిస్టియన్లు, సిక్కులు, గిరిజనులు, జైనులు, పార్సీలు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని అన్నారు గులాం నబీ ఆజాద్. కాబట్టి యూనిఫాం సివిల్ కోడ్ అమలు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

Read More: BRO Movie First Single : ‘బ్రో’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు!