Site icon HashtagU Telugu

Delhi IIT Suicide Case: ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Delhi IIT Suicide Case

New Web Story Copy 2023 09 02t012937.862

Delhi IIT Suicide Case: ఐఐటీ ఢిల్లీలోని వింధ్యాచల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన విద్యార్థిని అనిల్‌కుమార్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలలోకి వెళితే.. కిషన్‌గఢ్ ఐఐటీలో వింధ్యాచల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గది మూసి ఉండడంతో ఆచూకీ తెలియలేదు. మృతుడు అనిల్ కుమార్ (21)గా గుర్తించారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిషన్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు కాల్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు . సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు . అతను జూన్ నెలలో హాస్టల్ ఖాళీ చేయాల్సి వచ్చింది, కానీ కొన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఇందుకోసం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఆరు నెలల సమయం ఇచ్చారు.

Also Read: ANR – NTR : ఏఎన్నార్, ఎన్టీఆర్‌కి కోపం రావడంతో.. కాళ్ళ మీద పడ్డ దర్శకుడు..