Viral Fashion: దొంగతనం కాదు.. వింత ఫ్యాషన్ షో!!

మీకు నవ్వు రావడం లేదా ? ఇప్పుడు నవ్వు రావాలా ? అయితే ఈ మేల్ మోడల్ ఫ్యాషన్ షో చూడండి.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 08:30 AM IST

మీకు నవ్వు రావడం లేదా ? ఇప్పుడు నవ్వు రావాలా ? అయితే ఈ మేల్ మోడల్ ఫ్యాషన్ షో చూడండి. కడుపుబ్బా నవ్వేస్తారు.
అట్ట పెట్టెలు, నిచ్చెన, బల్ల, కుర్చీ, మొక్కల తొట్టెలు, రేకులు, తలుపు, ఇంటి గేటు, మంచం పట్టీలు, నీటి డ్రమ్ముతో ఫిజీ దేశానికి చెందిన మోడల్ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్ తీసిన వీడియో అదుర్స్ అనిపిస్తోంది. ఒకే ఒక్క రోజులో ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోకు 69 లక్షల వ్యూస్, 2.50 లక్షల లైక్స్ వచ్చాయి. మోడల్స్ సాధారణంగా వైవిధ్యభరిత దుస్తులతో జిగేల్మనిపిస్తారు. కానీ
మోడల్ షహీల్ ఇంట్లోని వస్తువులనే వాడుకొని ర్యాంప్ వాక్ చేశాడు. ఆయన క్రియేటివిటీని అందరూ కొనియాడుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశారు. ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్‌ పెట్టారు. వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది ఫ్యాషన్ షోనా లే​క ఇంట్లో దోపిడీ చేస్తున్నాడా అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.