Comet : ఈ తోకచుక్కను ఇప్పుడు చూడకపోతే.. మళ్లీ 50 వేల ఏళ్లు ఆగాలి

ఓ అరుదైన తోకచుక్క భూమికి (Earth) సమీపానికి వస్తోంది. దీని పేరు సీ/2022 ఈ3 (జెడ్ టీఎఫ్).

ఓ అరుదైన తోకచుక్క (Comet) భూమికి సమీపానికి వస్తోంది. దీని పేరు సీ/2022 ఈ3 (జెడ్ టీఎఫ్). ఇది త్వరలోనే సూర్యుడు, భూమికి సమీపంగా రానుంది. సౌర వ్యవస్థలో మంచు ప్రాంతాలను దాటుకుంటూ జనవరి 12 నాటికి సూర్యుడికి సమీపంగా రానుంది. ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి 1న భూమికి సమీపానికి వస్తుంది. దీన్ని కళ్లతో నేరుగా చూడొచ్చు. లేదంటే మంచి బైనాక్యులర్ ఉన్నాకానీ స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో ఫుల్ మూన్ ఉంటే చూడ్డానికి కష్టం.

పట్టణాల్లో లైట్ల కాంతి కంటే కూడా బయటకు వెళ్లి చూస్తే మంచిగా కనిపిస్తుంది. భూమికి సమీపానికి వచ్చినప్పుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుందని క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ తెలిపారు. ఈ తోకచుక్క (Comet) ఒక కిలోమీటర్ పరిమాణంలో ఉంటుందని ప్యారిస్ అబ్జర్వేటరీ ఆస్ట్రో ఫిజిస్ట్ నికోలర్ బివర్ చెప్పారు. ఇదే తోకచుక్క మళ్లీ 50 వేల ఏళ్ల తర్వాతే భూమికి సమీపానికి వస్తుందని తెలిపారు.

Also Read:  Veerasimha Reddy : ట్రెండింగ్ అవుతున్న ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్!