Hydra: చెరువులలో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా (Hydra) కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబరు 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు.. కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ఈ క్రతువులో చేతులు కలపాలని హైడ్రా కోరింది.
Also Read: Delhi : ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్.. నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ!
ఇప్పటివరకూ 48 కేసులు
రాత్రీపగలూ నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై హైడ్రా కేసులు పెట్టింది. ఇందులో లారీ ఓనర్లతో పాటు.. నిర్మాణ సంస్థలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ నిఘాను తీవ్రతరం చేసి.. చెరువుల్లో మట్టి నింపుతున్న వాహనదారులతో పాటు.. మట్టి తరలించే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది.