Jagadeeshwar Goud: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ కిన్నెర గార్డెన్ లో పాస్టర్ అసోసియేషన్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అతిపెద్ద పార్టీ అయినా కాంగ్రెస్ కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తుందని, క్రిస్టియన్స్ సంక్షేమం కోసం అనేక పథకాలు పెట్టిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో క్రిస్టియ న్స్ సంఘాలకు అందుబాటులో ఉంటానని, వారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
పాస్టర్ అసోసియేషన్ మద్దతు తెలిపినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత క్రిస్టియన్స్ కోసం అండగా నిలబడుతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Harish Rao: తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం: మంత్రి హరీశ్ రావు