Fly 6000 Kmph : అరగంటలోనే కాశ్మీర్ టు కన్యాకుమారి.. 2035 నాటికి హైపర్‌సోనిక్ విమానం

Fly 6000 kmph : గంటకు 6000 కిలోమీటర్ల స్పీడ్ తో జర్నీ చేసే రోజులు కూడా ఫ్యూచర్ లో వస్తాయి.. ఇందుకోసం హైడ్రోజన్ ఇంధన శక్తితో నడిచే హైపర్‌సోనిక్ విమానాలు రెడీ అవుతున్నాయి.. 

  • Written By:
  • Updated On - June 20, 2023 / 09:47 AM IST

Fly 6000 kmph : గంటకు 6000 కిలోమీటర్ల స్పీడ్ తో జర్నీ చేసే రోజులు కూడా ఫ్యూచర్ లో వస్తాయి.. 

ఇందుకోసం హైడ్రోజన్ ఇంధన శక్తితో నడిచే హైపర్‌సోనిక్ విమానాలు రెడీ అవుతున్నాయి.. 

ఇవి గంటకు 6,000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ఆకాశ వీధిలో దూసుకెళ్లగలవు.  

2035 నాటికి ఇలాంటి హైపర్‌సోనిక్ విమానం అందుబాటులోకి రానుంది. 

ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యా కుమారికి (3676 కిలోమీటర్ల దూరం) విమానంలో వెళ్లేందుకు 4 గంటలకుపైనే  టైం పడుతోంది.. 

హైపర్‌సోనిక్ విమానం వస్తే అర గంటలోనే ఈ జర్నీ కంప్లీట్ అవుతుంది.  

స్విట్జర్లాండ్ కు చెందిన ఏరో స్పేస్ కంపెనీ డెస్టినస్ (Destinus)  హైపర్ సోనిక్ విమానాల తయారీ రేసులో దూసుకుపోతోంది. ఆ కంపెనీ డెవలప్ చేసిన నమూనా హైపర్ సోనిక్ విమానం జంగ్‌ఫ్రా (Jungfrau)ను తొలిసారి 2021 నవంబర్ 19వ తేదీనే జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో టెస్ట్ చేశారు. తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన వివా టెక్నాలజీ ట్రేడ్ షోలో దీన్ని ప్రదర్శించారు. జంగ్‌ఫ్రా హైపర్ సోనిక్ విమానాల్లో ఒక మోడల్ కారు సైజులో.. మరో మోడల్ బస్సు సైజులో ఉంటాయి. ఈ విమానంలో ఒకే టైంలో 400 మంది జర్నీ చేయొచ్చు. దీని స్పీడ్ కెపాసిటీ మాక్ 5 .. అంటే కాంతి వేగం కంటే 5  రెట్లు ఎక్కువ. గంటకు 6,000 కి.మీ వేగంతో(Fly 6000 kmph) ఈ విమానం జర్నీ చేస్తుంది.

Also read : South Carolina: ఇదేందయ్యా ఇది.. ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి వెళుతున్న యువతి?

జంగ్‌ఫ్రా హైపర్ సోనిక్ విమానాల్లో  హైడ్రోజన్ ఆధారిత ఆఫ్టర్‌ బర్నర్ సిస్టమ్‌ ఉంటుంది. ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విమానంతో గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళింది. ప్రస్తుతం మనం జర్నీ చేస్తున్న విమానాల స్పీడ్ (గంటకు 900 కి.మీ) కూడా ఇంతకంటే ఎక్కువే ఉంది. 2024కల్లా మాక్ 5 లెవల్ స్పీడ్ తో దీని ట్రయల్ పూర్తి చేయాలని డెస్టినస్ (Destinus) కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది.  2035 కల్లా అన్ని లోపాలను అధిగమించి హైపర్ సోనిక్ విమానాన్ని తీసుకురావాలనే పట్టుదలతో డెస్టినస్ ఉంది.