సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట, ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలపై(Illegal Structures) హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. నాలా వెడల్పు తగ్గిపోయి వర్షాకాలంలో వరదలు కాలనీల్లోకి వస్తున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం ఉదయం నుంచి బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభించారు.
Kidney Stones : అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి..? వాటి లక్షణాలు, నివారణ చిట్కాలు ఏంటి…?
బేగంపేట నాలా పరివాహక ప్రాంతంలో నివాస భవనాలు, గోడలు, వాణిజ్య స్థలాలపై చేపట్టిన ఈ కూల్చివేతలు భారీగా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. అక్రమ కట్టడాల వల్ల నాలా మూసివేయబడటంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్ళే మార్గం లేక జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నది. దీంతో నివాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చేపట్టిన ఈ చర్య వల్ల వరదల ప్రభావం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!
అయితే ఈ పనులు ట్రాఫిక్‌కు మాత్రం తాత్కాలికంగా భారంగా మారాయి. బేగంపేట, ప్యాట్నీ, రాణిగంజ్ వంటి ప్రధాన కూడళ్లలో ఉదయం నుండి వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ పోలీస్‌లు దారులు మళ్లించి వాహనదారులకు సహాయం చేస్తున్నారు. అధికారుల ప్రకారం, ఈ కూల్చివేతలతో నాలా శుభ్రం అయి వర్షాకాలంలో ముంపు సమస్యలకు స్థిర పరిష్కారం లభించనుంది. కాగా గురువారం అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్‌కావేటర్లతో చిన్నరాయుని చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు, హ్రైడా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు.