Hyderabad: కొడుకుకి కిడ్నీ దానం చేసి మరోసారి ప్రాణం పోసిన తల్లి

కన్న పేగు బంధం తెంచుకోలేక ఆ తల్లి తన కుమారుడికి కిడ్నీ ఇచ్చి మరోసారో ప్రాణం పోసింది. హైదరాబాద్‌లోని ఓ మాతృమూర్తి తన కిడ్నీ దానం చేయడం చేసి తన 21 ఏళ్ల కొడుకుకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది

Hyderabad: కన్న పేగు బంధం తెంచుకోలేక ఆ తల్లి తన కుమారుడికి కిడ్నీ ఇచ్చి మరోసారో ప్రాణం పోసింది. హైదరాబాద్‌లోని ఓ మాతృమూర్తి తన కిడ్నీ దానం చేసి తన 21 ఏళ్ల కొడుకుకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వ్యక్తికి తన తల్లి నుండి అవయవ మార్పిడి జరిగింది. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో విజయవంతంగా మార్పిడి జరిగింది.

హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వ్యక్తి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. అతడికి కిడ్నీ ఫెయిల్యూర్‌గా గుర్తించి చికిత్స కోసం ఏఐఎన్‌యూకు తరలించారు డాక్టార్లు. అతని తల్లి 42 సంవత్సరాల వయస్సులో తన కిడ్నీని దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఆగస్టు రెండో వారంలో మార్పిడి విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని ఏఐఎన్‌యూలో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ చల్లా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.తన కిడ్నీని కొడుకుకు దానం చేయడం సంతోషంగా ఉందని బాధితుడి తల్లి తెలిపింది. నా కొడుకు కోసం ఏమైనా చేస్తానని ఆమె చెప్పింది.

Also Read: 240 Gold Coins Vs 4 Police : గోల్డ్ కాయిన్స్ దొంగిలించిన నలుగురు పోలీసులు.. బ్రిటీష్ కాలం నాటి 240 కాయిన్స్ మిస్టరీ