Site icon HashtagU Telugu

Kontham Tejaswini: లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువతి

Kontham Tejaswini

New Web Story Copy (65)

Kontham Tejaswini: హైదరాబాద్ కు చెందిన యువతి లండన్ లో అతి దారుణంగా హత్యకు గురైంది. లండన్‌లోని వెంబ్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువతిని బ్రెజిల్ పౌరుడు కత్తితో దాడి చేశాడు. మృతురాలిని కొంతం తేజస్వినిగా గుర్తించారు.

వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్ ప్రాంతంలో నివసిస్తున్న తేజస్విని మరియు ఆమె రూమ్‌మేట్‌పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా, మరొకరికి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉన్నత చదువుల కోసం లండన్‌కు వచ్చిన తేజస్విని లండన్ లో హత్యకు గురి కావడం అత్యంత బాధాకరం. తేజస్విని మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ కూతురు తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. హైదరాబాద్‌లో ఉంటున్న తేజస్విని బంధువు విజయ్‌ మాట్లాడుతూ.. నిందితుడు బ్రెజిల్‌ వ్యక్తి అని, వారం రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడని తెలిపారు. మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు తేజస్విని గతేడాది మార్చిలో లండన్ వెళ్లింది.

Read More: Vande Bharat: ఒడిశా ఎఫెక్ట్.. త్వరలో 5 వందేభారత్ రైళ్లు ప్రారంభం!