Hyderabad: ప్రేమ విఫలం కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శనివారం ఆదిబట్లలోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శనివారం ఆదిబట్లలోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన నాగ చంద్రప్రకాష్ (25) ఆదిబట్లలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ పొరుగునే ఉన్న పురుషుల హాస్టల్‌లో ఉంటున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతీ తన ప్రేమను తిరస్కరించడంతో చంద్ర ప్రకాష్ గత కొన్ని రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున తన గదిలోని ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఉదయం అతడిని స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదిబట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

Also Read: India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 219/7..!

  Last Updated: 24 Feb 2024, 05:10 PM IST