Site icon HashtagU Telugu

Hyd Police : బ‌హిరంగ ప్ర‌దేశాలు, రోడ్ల‌పై బాణ‌సంచా పేలిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్న పోలీసులు

Diwali Safety Tips

Diwali Safety Tips

దీపావళి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ రోడ్లపై క్రాకర్స్ పేల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్‌ నగర పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో శబ్దాలు వెదజల్లే బాణాసంచా పేల్చడంపై పూర్తి నిషేధం ఉంటుందని తెలిపారు. “క్రాకర్స్, డ్రమ్స్, డీజేలు ఇతర వాయిద్యాల నుండి శబ్దం స్థాయి, ఏదైనా ఉంటే, రాత్రి 8 నుండి 10 గంటల మధ్య కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అనుమతించబడిన పరిమితులను మించకూడదని ఆయ‌న తెలిపారు. ఈ ఉత్తర్వులు నవంబర్ 12 నుంచి నవంబర్ 15 వరకు అమల్లో ఉంటాయని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో దీపావళికి నవంబర్ 12న ప్ర‌భుత్వం అధికారిక సెలవు ప్ర‌క‌టించింది.

Also Read:  Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు