Site icon HashtagU Telugu

Minor Girl Raped: పాతబస్తీలో మైనర్ పై గ్యాంగ్ రేప్!

Crime

Crime

హైదరాబాద్ లో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 17న, ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలిక తన అమ్మమ్మను కలిసేందుకు వెళుతుండగా, ఆమెను ఒంటరిగా గుర్తించిన కొందరు వ్యక్తులు బలవంతంగా బండ్లగూడ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపిసి సెక్షన్ (363) కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి జి శేఖర్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విచారణ చేపట్టారు.

విచారణలో మైనర్ బాలిక ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన వాస్తవాలను వివరించింది. పోలీసులు నిందితుల కోసం గాలించి అబ్బు, సోహైల్, ఫిరోజ్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితురాలిని తర్వాత చైల్డ్ హోం కేంద్రానికి తరలించారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సెక్షన్లను IPC సెక్షన్ 376(D) POCSO చట్టంగా మార్చారు. పోలీసులు కేసును గోప్యంగా ఉంచినప్పటికీ, నిందితుల అరెస్టును ఈరోజే ప్రకటించే అవకాశం ఉంది.