Site icon HashtagU Telugu

Bomb Threat: బాంబు ఘటనలో ఆకతాయి అరెస్ట్!

Bomb

Bomb

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఏప్రిల్ 13వ తేదీ బుధవారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం ఒక ఆకతాయిని పట్టుకుంది. అజ్ఞాత వ్యక్తి 100కి ఫోన్ చేసి బాంబు గురించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో విశాఖపట్నం నుంచి ముంబైకి వెళ్తున్న 2 రైళ్లను రైల్వే పోలీసులు తనిఖీలు చేసేందుకు నిలిపివేశారు. కాజీపేట వద్ద ఎల్‌టిటి రైలు, హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత బెదిరింపు ఫోన్ కాల్ బూటకపు సమాచారం అని తేలింది. రైల్వే, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం హైదరాబాద్‌లోని బహదూర్‌పల్లిలో కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి పట్టుకుంది. విచారణలో 19 ఏళ్ల థోరి కార్తీక్‌గా వెల్లడించాడు. పోలీసు డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంటుందా? లేదా? అని చూసేందుకే కాల్ చేసినట్లు పోలీసుల ముందు వాపోయాడు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version