Hyderabad: బోరు వేస్తుండగా కుప్పకూలిన హోండా షోరూం భవనం

శంషాబాద్ మున్సిపాలిటీలో హోండా షోరూం భవనం కుప్పకూలింది . కొత్త వాహనాలపై భవనం కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.హోండా షోరూంలో ఉన్న ఉద్యోగులంతా బయటకు పరుగులు తీశారు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: శంషాబాద్ మున్సిపాలిటీలో హోండా షోరూం భవనం కుప్పకూలింది . కొత్త వాహనాలపై భవనం కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.హోండా షోరూంలో ఉన్న ఉద్యోగులంతా బయటకు పరుగులు తీశారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో బోరు వేస్తుండగా వైబ్రేషన్ రావడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ భవనం కొన్ని సంవత్సరాల నాటిదని స్థానికులు చెప్తున్నారు.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ భవనం కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది . మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో అనేక శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నా .. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

Also Read: Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు

  Last Updated: 10 Feb 2024, 05:32 PM IST