హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro Rail) నగర ప్రజల రవాణా వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులూ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. మెట్రో ప్రయాణం వేగంగా, సౌకర్యంగా ఉండే విధంగా మెట్రో సిబ్బంది ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్లలో ప్రవేశించే ప్రయాణికుల వద్ద ఏవైనా నిషేధిత వస్తువులున్నాయా? అనే విషయంలో క్షుణ్ణంగా తనిఖీ చేపడుతున్నారు. అయితే పలు సందర్భాల్లో కొన్ని వస్తువుల అనుమతిపై ప్రయాణికులకు అవగాహన లేకపోవడం వల్ల మెట్రో సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైలులో అనుమతించని వస్తువుల జాబితాను స్పష్టంగా ప్రకటించింది.
Gudivada Amarnath : విజయసాయి రెడ్డి పై అమర్నాథ్ ఫైర్
మెట్రో రైలులో ప్రయాణించేటప్పుడు తుపాకీలు, ఎయిర్ రైఫిల్స్, స్టన్‌గన్, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, యాసిడ్స్, విష పదార్థాలు వంటి ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. అలాగే గొడ్డళ్లు, రంపాలు, పొడవైన స్క్రూడ్రైవర్లు, కత్తెరలు, కటింగ్ ప్లేయర్లు, మాంసం కోసే కత్తులు వంటివి కూడా అనుమతించరు. ఉపాధి నిమిత్తం పనిముట్లను తీసుకెళ్లే వారికీ కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అదనంగా పెంపుడు జంతువులను మెట్రోలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అయితే భద్రతా సిబ్బంది ఉపయోగించే కుక్కలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మానవుల లేదా జంతువుల అవశేషాలు, పాడైన ఆహార పదార్థాలు, సీల్ వేయని చేపలు, మాంసం వంటి పదార్థాల రవాణా కూడా నిషేధితంగా ప్రకటించారు.
Congress Party : కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ – రాజాసింగ్
మద్యం తాగి మెట్రోలో ప్రయాణించడం కఠినంగా నిషేధించబడింది. అయితే సీల్ చేయబడిన రెండు మద్యం సీసాలను మాత్రమే ప్రయాణికులు తమతో తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. ఓపెన్ బాటిళ్లను అనుమతించరు. మెట్రో రైలు లేదా మెట్రో ప్రాంగణంలో మద్యం తాగడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంగా వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న ఈ చర్యలను అందరూ గౌరవించి సహకరించాల్సిన అవసరం ఉంది. మెట్రో ప్రయాణాలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా ప్రయాణికులు కూడా నిబంధనలను పాటించడం ఉత్తమం.