Site icon HashtagU Telugu

Eluru : అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త..చూస్తుండిపోయిన స్థానికులు

Eluru Murder

Eluru Murder

ఏపీలో కూటమి సర్కార్ వచ్చింది హత్యలు , నేరాలు , అత్యాచారాలు ఇవన్నీ తగ్గిపోతాయని అంత భావించారు. కానీ మారింది ప్రభుత్వమే కానీ మనుషులు కాదని తేటతెల్లం అవుతుంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట నేరాలు , ఘోరాలు అనేవి బయటపడుతూనే ఉన్నాయి. అమాయకులపై హత్యలు , అభంశుభం తెలియని చిన్నారులపై , ఒంటరి మహిళలపై అత్యాచారాలు, రాజకీయ హత్యలు ఇలా ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్య ను అతి కిరాతకంగా నడి రోడ్ ఫై అంత చూస్తుండగా నరికి చంపేసిన ఘటన సంచలనం రేపుతోంది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ఫోన్ వాడకం బాగా పెరిగింది. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్ తోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ఫోన్ వల్ల ఉపయోగాల కంటే అపాయమే ఎక్కువ ఉంది. ముఖ్యముగా యువత ఫోన్ ద్వారా చెడిపోతుంటే..ఇదే క్రమంలో అనుమానాలు సైతం ఎక్కువైపోతున్నాయి. గంటల తరపడి యువతీ కానీ యువకుడు కానీ పెళ్లైన వారు కానీ ఎలా ఎవరైనా మాట్లాడితే పక్క వారికీ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సదరు వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారో..అనే అనుమానం పెంచుకుంటూ..ఆ అనుమానంలో కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లైన వారిలో ఈ అనుమాన భూతం అనేది నిద్ర పోనివ్వదు..తిన్నింనవ్వదు..ఏంచేయనివ్వదు..ఈ ఆవేశంలో రాక్షసుడిగా మరి కట్టుకున్న భార్యను కడతేరుస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో అదే జరిగింది.

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో తన భార్య సాయిలక్ష్మి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని అనుమానంతో నడిరోడ్డు ఫై అతి దారుణంగా అంత చూస్తుండగా నరికి చంపేశాడు. స్థానికులు చూస్తూ ఉండిపోయారు కానీ ఎవ్వరు అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Uttar Pradesh: జేపీ నడ్డా పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1.25 లక్షల డిమాండ్, నిందితుడు అరెస్ట్