Site icon HashtagU Telugu

France Protests: అట్టుడుకుతున్న ఫ్రాన్స్..

France Protests

New Web Story Copy 2023 07 01t162204.070

France Protests: 17 ఏళ్ళ నహేల్ ను ఫ్రాన్స్ పోలీసులు కాల్చి చంపారు. పోలీసులు అతడిని పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చారు. ట్రాఫిక్ తనిఖీలో నహెల్ చంపబడ్డాడు. జూన్ 27న జరిగిన ఈ ఘటనపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆందోళనకారులతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ఇప్పటికే 1,311 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసనలో 200 మంది పోలీసులు గాయపడ్డారు.. 4 రోజులుగా ఫ్రాన్స్ లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

ఫ్రాన్స్ లో హింసను అణిచివేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 45,000 మంది పోలీసులను మోహరించింది. రాత్రంతా, యువత నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. సుమారు 2,500 దుకాణాలను తగులబెట్టారు మరియు ధ్వంసం చేశారు. నహెల్ హత్యకు నిరసనగా ఫ్రాన్స్ మండిపడింది. పారిస్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Read More: Rajamouli: క్రీడారంగంలోకి జక్కన్న.. ISBC చైర్మన్ గా రాజమౌళి