Site icon HashtagU Telugu

Warner Bros Studios : కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో భారీ అగ్నిప్ర‌మాదం..

Warner Bros Studios

Warner Bros Studios

అమెరికా కాలిఫోర్నియా (California) లో ప్రపంచ ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ స్టూడియో (Warner Bros Studios) లో భారీ అగ్నిప్ర‌మాదం (huge Fire Accident) చోటుచేసుకుంది. బ‌ర్బ్యాంక్ లో ఉన్న ఈ వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ స్టూడియంలో ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ పేలి భారీగా మంట‌లు చెల‌రేగాయి. మంట‌ల నుండి వెలువ‌డిన పొగ ఆ ప్రాంతాన్ని క‌ప్పేసింది. అయితే, ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి గాయాలు కాలేదు. మంట‌ల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకొచ్చారు. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ యాజ‌మాన్యంలోని స్టూడియో నుండి మంట‌లు ఎగ‌సిప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వీడియోల్లో క‌నిపించాయి. ఈ ఘ‌ట‌న అక్క‌డి కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల స‌మ‌యంలో చోటుచేసుకుంది. అప్ర‌మ‌త్త‌మైన ఫైర్ సిబ్బంది ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను 30 నిమిషాల్లో అదుపు చేశారు.

ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి గాయాలు కాక‌పోవ‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. డ‌బ్ల్యూబీడీ ప్ర‌తినిధి డెడ్‌లైన్ మాట్లాడుతూ.. ట్రాన్స్ ఫార్మ‌ర్ పేల‌డం కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు చెప్పారు. స్టూడియంలో ఉన్న‌వారికి ఎవ‌రికీ గాయాలు కాలేదని, ప్ర‌తీఒక్క‌రిని జాగ్ర‌త్త‌గా ఇంటికి పంపించామ‌ని చెప్పారు. అయితే, ఈ అగ్నిప్ర‌మాదంలో న‌ష్టం ఎంత అనేది ఇంకా తెలియ‌రాలేదు. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ బ‌ర్బ్యాంక్‌లో 110 ఎక‌రాల స్థ‌ల‌లో ఉంది. ఇందులో మొత్తం 36 సౌండ్ స్టేజ్‌లు, 14 బాహ్య సెట్‌లు ఉన్నాయి.

Kanaka Durga Temple : దుర్గ‌గుడిలో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ చైర్మ‌న్‌, ఈవో మధ్య విభేదాలు.. ఈవోపై చైర్మ‌న్ ఆగ్ర‌హం