Site icon HashtagU Telugu

Kashmir : కాశ్మీర్ లో జాతీయ జెండాను ఎగురవేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తమ్ముడు

Terrorist Javed Mattu's Bro

Terrorist Javed Mattu's Bro

దేశం మొత్తం ఇండిపెండెన్స్ డే (Independence Day) వేడుకల్లో నిమగ్నమైంది. ఎక్కడ చూసిన ఆ వేడుకల హడావిడే కనిపిస్తుంది. ఈ తరుణంలో కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తమ్ముడు జాతీయ జెండా ఎగురవేసి వార్తల్లో నిలిచారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ (Javed Mattoo) సోదరుడు రయీస్ మట్టూ (Rayees Mattoo) జమ్మూకశ్మీర్ లోని సోపోర్ లో తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

దీనికి సంబంధించి ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత పౌరులుగా తాము ఎంతో గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగా ఉంటామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ‘సహజమైన భావోద్వేగంతోనే జాతీయ జెండాను ఎగురవేస్తున్నాను. ఇది పూర్తిగా ఐచ్ఛికం. ఎవరి ప్రభావానికి లొంగేది లేదు. మా భూమి భరతభూమి. ప్రపంచంలోని అన్నింటికంటే మాతృభూమి మాకు మిన్న. ఇక్కడే పుట్టిపెరిగాం. ఇక్కడి అంoమైన ప్రకృతి, తోటలతో మమేకమవుతాం.

ఇక్కడ ప్రగతి, పురోగతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆగస్టు 14న నాకు చాలా ప్రత్యేకం. నా షాపు తెరిచాను. గతంలో రాజకీయ శక్తుల వల్ల ఇక్కడ అభివృద్ధికి అనేక అవరోధాలు తలెత్తేవి. 2009లో నా సోదరుడు తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లిపోయాడు. అప్పట్నించి సమాచారం లేదు. ఇప్పటికీ నా సోదరుడు బతికి ఉంటే, తన ఆలోచనను మార్చుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నాను. పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ శక్తిహీనం అయింది. మేము నిజమైన భారతీయులుగా మా మాతృభూమిలోనే జీవనం సాగిస్తాం” అని రయీస్ మట్టూ తెలిపారు.

Read Also : Independence Day 2023: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటకు 1800 మంది ప్రత్యేక అతిధులు?