Site icon HashtagU Telugu

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. కారణమిదేనా..?

Himachal Pradesh

Resizeimagesize (1280 X 720) 11zon

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident)చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఐజీఎంసీ ఆస్పత్రి కొత్త భవనంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఐజీఎంసీ ఆస్పత్రి కొత్త భవనంలో గురువారం ఉదయం 8:50 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది.

మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల పొగలు కమ్ముకున్నాయి. అదే సమయంలో సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఐజీఎంసీ ఆసుపత్రి కొత్త భవనంలో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Also Read: Anand Mohan: గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదల

ఐజీఎంసీలో నిర్మించిన కొత్త ఓపీడీ భవనం నుంచి వెలువడుతున్న పొగలు నగరాన్ని వణికించాయి. ఈ భవనం పై అంతస్తులో ఒక కేఫ్ ఉంది. ఈ కేఫ్‌లో సిలిండర్‌ పేలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. సిమ్లాలోని ఐజిఎంసిలోని కొత్త ఒపిడి పై అంతస్తులో ఉన్న క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు, ప్రాణ, ఆస్తి నష్టం గురించి సరైన సమాచారం ఇవ్వలేదు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు రెండు వాహనాలను పంపించారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పని కొనసాగుతోందని, ప్రాథమిక దశలో సిలిండర్ పేలడమే అగ్నిప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.