సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కే.టి.రామారావు(KTR) క్యాంపు కార్యాలయం (Camp Office) వద్ద రాజకీయంగా తలెత్తిన వివాదం రచ్చరచ్చగా మారింది. ప్రొటోకాల్ ప్రకారం క్యాంపు కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో (CM Photo) తప్పనిసరిగా ఉండాల్సిన నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఆఫీసులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తీసుకుని వారు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ముందుకు వచ్చారు.
Black Burley Tobacco : బ్లాక్ బర్లీ పొగాకు రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్
కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగుతున్న సమయంలో, స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు తోపులాట కూడా జరిగింది. ఉద్రిక్తత క్రమంగా పెరిగిపోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు.
ఉద్రిక్తత ముదరడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. లాఠీఛార్జ్ సమయంలో కొన్ని మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారికంగా స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఇది రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికారులు శాంతి భద్రతల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.