Site icon HashtagU Telugu

Mohan Babu : హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు

High court refused to grant interim orders to Mohan Babu

High court refused to grant interim orders to Mohan Babu

Mohan Babu : మోహన్ బాబు ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు విచారించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా..ఆదేశాలు ఇవ్వాలని మోహన్‌బాబు న్యాయవాది కోర్టును కోరారు. కౌంటర్‌ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

కాగా, కుటుంబ గొడవల్లో భాగంగా.. న్యూస్ కవరేజ్‌కు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబు పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబుపై మొదట బీఎన్‌ఎస్‌ 118(1) సెక్షన్‌ కింద కేసు నమోదు చేయగా.. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే.. మోహన్‌బాబు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

కాగా, మంచు ఫ్యామిలీలో డిసెంబర్ 10వ తేదీన రాత్రి సమయంలో చోటుచేసుకున్న గొడవలొ మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్, మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 11న ఉదయం పదిన్నరకు సీపీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనగా.. మంచు మనోజ్, మంచు విష్ణు విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 24 వరకు మోహన్ బాబుకు మినహాయింపు ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

Read Also: 10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల