Heavy Rains Today : నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

Heavy Rains Today : తెలంగాణలోని పలు జిల్లాలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 07:51 AM IST

Heavy Rains Today : తెలంగాణలోని పలు జిల్లాలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే ఛాన్స్  ఉందని చెప్పారు. రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Heavy Rains Today) కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Also read : Vande Sadharan: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందేభారత్ స్థానంలో వందే సాధారణ్..?

ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మేరకు.. 

‘‘ఈరోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మేరకు ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.  నిన్నటి ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని వివరించింది. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని తెలిపింది.

Also read : Trinamool Clean Sweep : దీదీ పార్టీ క్లీన్ స్వీప్.. బెంగాల్ లోకల్ పోల్స్ లో హవా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రానున్న మూడు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  రేపు (గురువారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ కేంద్రం సూచించింది.

Also read : Miss Netherlands: ‘మిస్ నెదర్లాండ్స్ 2023’ టైటిల్‌ను గెలుచుకున్న ట్రాన్స్ జెండర్