Hyderabad: హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం తేలికపాటి చిరు జల్లులు పడ్డాయి, షేక్‌పేట ప్రాంతంలో అత్యధికంగా వర్షం కురిసింది. తిరుమలగిరి, సికింద్రాబాద్, చార్మినార్, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గన్ పార్క్, రవీంద్ర భారతి, లక్డీకా పూల్, అయోధ్య జూనియర్, పీటీఐ, మహావీర్ హాస్పిటల్ నుంచి మాసాబ్ ట్యాంక్ వైపు నీరు నిలిచిపోవడం, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట, మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్టలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నిమజ్జనం ఏర్పాట్లకు ఆటంకంగా మారింది
ఇక ఖైరతాబాద్ గణేష్ వద్దకు చేరుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, గురువారం, నగరంలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.రానున్న మూడు రోజుల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read: Malkajgiri Congress Leaders : మైనంపల్లి కి టికెట్ ఇస్తే ఊరుకోం – మల్కాజిగిరి కాంగ్రెస్ క్యాడర్