Benefits of Ramaphalam : సీజన్ల వారీగా లభించే పండ్లలో రామఫలం కూడా ఒకటి. ఈ ఫలం ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. చూడటానికి ఎర్రగా ఉండే ఈ ఫలం.. సీతాఫలం లాగానే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా అడవుల్లో లభించే రామఫలాన్ని చాలా మంది ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. అడవుల నుంచి సేకరించి పట్టణాలకు తీసుకొచ్చి మార్కెట్లలో దీనిని అమ్ముతుంటారు. సీతాఫలం తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో.. రామఫలం తినడం వల్ల కూడా ఆరోగ్య ఫలితాలు ఉంటాయంటున్నారు. రామఫలాన్ని తినడం వల్ల ఏయే పోషకాలు లభిస్తాయో, ఏయే వ్యాధులు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రామఫలాన్ని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం చాలా బాగుంటుంది. జుట్టు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖంపై ఏర్పడిన మొటిమలు తొలగిపోవడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ తో బాధపడేవారు రామఫలాన్ని రెగ్యులర్ గా తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. శరీరంలో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
రామఫలంలో సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారు రామఫలాన్ని తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి.. ఈ సీజన్ లో లభించే రామఫలాన్ని తినడం అస్సలు మిస్ అవ్వకుండా తినండి.
Also Read : Barley Water: బార్లీ నీటితో బోలెడు ప్రయోజనాలు.. బార్లీ వాటర్ ఎలా తయారు చేయాలంటే..?
