తెలంగాణ మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు (Hatish Rao ) ప్రయాగరాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh )లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన గంగానది తీరానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు. భారతదేశం వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్న కుంభమేళాలో హరీష్ రావు ప్రత్యేకంగా హాజరై పూజలు నిర్వహించారు.
America : భారత వలసదారుల తరలింపు పై అమెరికా స్పందన..
ప్రయాగరాజ్‌లో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమంలో ఆయన పుణ్యస్నానం చేసిన అనంతరం వివిధ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి సాధు, సంతుల ఆశీస్సులు తీసుకున్నారు. హిందూ సంప్రదాయాల్లో కుంభమేళా ఎంతో పవిత్రమైనదని, ఇందులో పాల్గొనడం జీవితంలో అపూర్వమైన అనుభూతి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కుంభమేళా హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పవిత్ర మహోత్సవం. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షిస్తుంది. మహాకుంభమేళా సందర్బంగా హరీష్ రావు చేసిన పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.