AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం సాయంత్రం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టగా, ఈ సందర్భంగా పోలీస్ శాఖలో కొత్త శకం ప్రారంభమైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, సమర్థత, ప్రజానుకూల శైలి ద్వారా మార్పు తీసుకురావడానికి హరీష్ గుప్తా నాయకత్వం కీలకంగా నిలవనుందని పేర్కొన్నారు.
Samantha-Raju Nidimoru : రెడ్ హ్యాండెడ్‌గా అతడితో దొరికిపోయిన సమంత
ఇప్పటికే ఫిబ్రవరి 1, 2025 నుంచి ఇన్‌ఛార్జి డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న హరీష్ కుమార్ గుప్తా, తన పని తీరుతో ప్రభుత్వానికి విశ్వాసాన్ని కలిగించారని భావిస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పంపిన అధికారుల ప్యానల్ నుంచి ఆయనను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆయన్ను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా హరీష్ గుప్తా ఈ పదవిలో పూర్తి రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇది పోలీస్ శాఖకు స్థిరమైన నేతృత్వాన్ని అందించనుండగా, గుప్తా విధుల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంపై ఆసక్తి నెలకొంది.
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హరీష్ గుప్తా పోలీస్ శాఖలోని సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. పోలీసింగ్‌లో ప్రజలతో మెరుగైన అనుసంధానం, మహిళా భద్రత, నేరాల నివారణ, నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై ప్రాధాన్యతనిచ్చి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు గుప్తాను కలిసి అభినందనలు తెలిపారు. ఆయన అనుభవం, స్థిరమైన తీరు, మార్పుల పట్ల గల దృక్పథం పోలీసు వ్యవస్థకు మేలుకొలుపుగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.