పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు (Pawan Kalyan) మరోసారి నిరాశ తప్పడం లేదు. హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే తేదీకి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమావిడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా వస్తుండడంతో హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. నిజంగా అదే తేదికి హరిహర వీరమల్లు వస్తే రాబిన్ హుడ్ ను బరిలోకి దింపేవారు కాదు.
CM Revanth : సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ
‘రాబిన్ హుడ్’ తో పాటు విజయ్ దేవరకొండ VD12 ప్రాజెక్ట్, అలాగే మ్యాడ్ స్క్వేర్ సినిమాలు కూడా అదే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇలా వరుస పెద్ద సినిమాల మధ్య హరిహర వీరమల్లు రావడం అనేది అసాధ్యమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పటికే హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) విషయంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా నిరీక్షణలో ఉన్నారు. ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లు వాయిదా అనేది తట్టుకోలేకపోతున్నారు. మరి నిజంగా వాయిదా పడినట్లేనా..? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
17వ శతాబ్దం మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో పవన్ కల్యాణ్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. బాబీ దేవోల్, అనుపమ్‌ఖేర్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, నిధి అగర్వాల్, జిషుసేన్ గుప్త ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.