GT vs CSK: మ్యాచ్ కు ముందు ధోనీని కలిసిన హార్దిక్.. వైరల్ వీడియో

ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. చెపాక్ మైదానంలో హార్దిక్ పాండ్యాకు ఎల్లో ఆర్మీ సవాల్ విసిరింది

Published By: HashtagU Telugu Desk
GT vs CSK

New Web Story Copy 2023 05 23t202836.924

GT vs CSK: ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. చెపాక్ మైదానంలో హార్దిక్ పాండ్యాకు ఎల్లో ఆర్మీ సవాల్ విసిరింది. మైదానంలో ధోనీ, హార్దిక్‌లు ఒకరిపై ఒకరు తలపడినప్పటికీ, ఇద్దరు కెప్టెన్ల మధ్య ప్రత్యేక స్నేహబంధం మరోసారి కనిపించింది.

వాస్తవానికి మొదటి క్వాలిఫయర్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలవడానికి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. ధోనీ, హార్దిక్ కలిసి నవ్వుతూ కనిపించారు. ధోనీ-హార్దిక్‌ల ప్రత్యేక బంధానికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. మాహీ, పాండ్య సరదా నవ్వులు సగటు క్రికెట్ అభిమానికి ఫీస్ట్ లా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహిష్ తీక్షణ

గుజరాత్ – శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

Read More: CSK vs GT: తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై

  Last Updated: 23 May 2023, 08:28 PM IST