Hanuman Idol Fire: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లిలో గురువారం జరిగిన షాకింగ్ ఘటనతో గ్రామంలో ఆందోళన చోటుచేసుకుంది. స్థానికులు హనుమాన్ విగ్రహానికి మంటలు వ్యాపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భయంతో కొంతకాలం అవాక్కయ్యారు. గురువారం సాయంత్రం పురాతన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వెంటనే ఆలయ ఆవరణలో ఉన్న హనుమాన్ విగ్రహం వరకు చేరుకున్నాయి. ఈ సంఘటన చూసిన స్థానికులు అప్రమత్తమై వెంటనే నీళ్లు పోసి మంటలు ఆర్పి, ప్రాణాపాయం తప్పించారు.
AI Pushpa 2 Trailer : అరై పుష్ప 2 ట్రైలర్ ను ఇలా చేశారేంట్రా..? రేయ్ .. ఎవర్రా మీరంతా..!!
ఈ ఘటనను చూసిన అర్చకులు నాగేశ్వర శర్మ ఆలయానికి జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, హనుమాన్ విగ్రహం మంటల్లో కాలిపోవడం వల్ల ఆ విగ్రహంలో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించానని చెప్పారు. స్థానికులు ఈ ఘటనను అశుభంగా భావించి, ఆలయమూ, గ్రామమూ పునఃప్రతిష్ఠ పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అర్చకులు , స్థానికులు వేద పండితులను సంప్రదించి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నారు.
పోలీసులకు సమాచారం అందించడంతో, కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఎందుకు చెలరేగాయో తెలుసుకోవడానికి పరిశీలన నిర్వహించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక ఎవరైనా గుర్తు తెలియని దుండగులు దీన్ని ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే.. స్థానికులు ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం యాదృచ్చికంగా జరిగిందా.. లేకుంటే ఎవరి హస్తమైనా ఉంటే.. వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే.. ఈ విషయం పక్క గ్రామాలకు తెలియడంతో.. ప్రమాదానికి గురైన హనుమాన్ విగ్రహాన్ని చూసేందుకు చుట్టు ప్రక్కల ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఘటన తరువాత, స్థానికులు భయాందోళనలో ఉండగా, అగ్నిప్రమాదానికి గురైన ఆలయ అవయవాలను పునఃప్రతిష్ట చేసే చర్యలు త్వరగా చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు.