Site icon HashtagU Telugu

Tollywood : ఐటెం బ్యూటీకి బ్రెస్ట్ క్యాన్సర్!

Hamsa Nandini Stunning Images 1

Hamsa Nandini Stunning Images 1

పలు ఐటెం సాంగ్స్ తో కుర్రకారును ఆకట్టుకున్న నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో తనదైన జీవితాన్ని గడిపిన హంసా క్యాన్సర్ బారిన పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘4 నెలల క్రితం, నా రొమ్ములో చిన్న గడ్డ ఉన్నట్లు అనిపించింది. నా జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండబోదని ఆ క్షణంలోనే తెలిసింది. 18 సంవత్సరాల క్రితం నేను ఒక భయంకరమైన వ్యాధితో మా అమ్మను కోల్పోయాను. నేను దాని చీకటి నీడలో జీవించాను. నేను భయపడ్డాను. కొన్ని గంటల్లో, నేను మామోగ్రఫీ క్లినిక్‌లో టెస్ట్ లో అనుమానం కలుగగా, నాకు బయాప్సీ అవసరమని సూచించిన సర్జికల్ ఆంకాలజిస్ట్‌ని వెంటనే కలవమని నన్ను అడిగారు. బయాప్సీ నా భయాలన్నింటినీ నిర్ధారించింది. గ్రేడ్ III ఇన్వాసివ్ కార్సినోమా (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది’’ అని పేర్కొంది.