Site icon HashtagU Telugu

Hail Rains: తెలంగాణలో నేడు,రేపు వడగళ్ల వర్షాలు

Hail Rains In Many Places In Telangana

Hail Rains In Many Places In Telangana

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తూ వాతావరణాన్ని చల్లబరిచాయి. ద్రోణి ప్రభావం కొనసాగుతుండడమే ఇందుకు కారణం. తాజాగా, వాతావరణశాఖ మరోమారు హెచ్చరికలు చేసింది. తెలంగాణలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం గురువారం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Also Read: Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడే వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బలు తిన్నాయి.