Site icon HashtagU Telugu

Gurugram: దారుణం..సూట్ కేసులో నగ్నంగా యువతి మృతదేహాం..!!

USA

USA

గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ సిటీలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇఫ్కో చౌక్ సమీపంలోని పొదల్లో సూట్ కేసు పడి ఉండటాన్ని కొందరు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూట్ కేసును తెరిచి చూసి షాక్ అయ్యారు. అందులో నగ్నంగా యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతురాలి వివరాల కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే..అసలు విషయం బయటపడుతుందన్నారు. స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version