Site icon HashtagU Telugu

GST : వాటిపై జీఎస్టీ 28 నుంచి 35 శాతానికి..!

Gst

Gst

GST : సామాన్యులపై పెను భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెరిగిన ధరలు సతమతమవుతున్న ప్రజలకు.. జీఎస్టీ పెరుగుదల మరింత భారం కానుంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (GoM) మంత్రుల బృందం, శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు వంటి హానికరమైన ఉత్పత్తులపై పన్ను రేటును 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది. ఈ బృందం, బట్టలపై కూడా పన్ను రేట్లను సవరించాలని నిర్ణయించింది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం, జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి ఏర్పాటు చేయబడింది. జీఎస్టీ కౌన్సిల్, GoM ప్రతిపాదించిన పన్ను మార్పులపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

CM Revanth Reddy : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రస్తుతం, జీఎస్టీ పన్ను నిర్మాణం ఐదు, 12, 18, 28 శాతం స్లాబ్‌లతో నాలుగు-స్థాయి పన్ను విధానాన్ని అనుసరిస్తోంది. GoM ప్రతిపాదించిన కొత్త రేట్ల ప్రకారం, శీతల పానీయాలు, పొగాకు , వాటి ఉత్పత్తులపై ప్రత్యేకంగా 35 శాతం పన్ను విధించబడుతుంది. అలాగే, బట్టలపై పన్ను రేట్లను సవరించే సూచనలు కూడా అందించాయి. రూ.1500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5%, రూ.1500 నుండి రూ.10,000 మధ్య ధర ఉన్న వస్త్రాలపై 18%, , రూ.10,000 కన్నా ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై 28% పన్ను విధించాల్సిందిగా GoM సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలు డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించబడతాయని అంచనా.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షత వహించే ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొంటారు. GoM, జీఎస్టీ పరిహారం సెస్ పై కూడా కొత్త మార్పులను సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఈ సెస్ విషయంలో అనేక చట్టపరమైన సమస్యలు ఉన్నందున, దీనిపై చర్చించడానికి మరిన్ని సమయం కావాలని GoM నిర్ణయించింది. కౌన్సిల్‌కు నివేదిక సమర్పించేందుకు GoM ఆరు నెలలు అదనంగా సమయం కోరవచ్చు.

Fengal Effect : భారీ వర్షాలు.. బెంగళూరులో స్కూల్స్‌, కాలేజీలు బంద్‌