Group-1 Preliminary Exam: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 8875 మందికి గాను 21 పరీక్షా కేంద్రాల్లో 6649 మంది పరీక్షకు హాజరయ్యారు. 2222 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, హాజరు శాతం 74.95గా నమోదైందని కలెక్టర్ తెలిపారు.