G20 Summit 2023 : జీ20 సదస్సులో పాల్గొనే వారికీ UPI ద్వారా డబ్బు పంపిణీ చేయబోతున్న సెంట్రల్‌ గవర్నమెంట్‌

కేంద్ర ప్రభుత్వం UPI చెల్లింపుకు ప్రోత్సాహం ఇవ్వడం తో ఎక్కడ చూడు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్స్ జరుగుతున్నాయి

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 04:56 PM IST

ఒకప్పుడు జేబులో చిల్లర లేనిది బయటకు వెళ్లే వారు కాదు..టి దగ్గరి నుండి ఇంట్లో సరుకుల వరకు ఏది కొనాలన్నా డబ్బులు (Money) చేతికి ఇచ్చేవాళ్లం..ఇక డబ్బుల కోసం ఎటిఎం ల చుట్టూ తిరిగేవాళ్లం..కానీ ఇప్పుడు ఆలా కాదు కేంద్ర ప్రభుత్వం UPI చెల్లింపుకు ప్రోత్సాహం ఇవ్వడం తో ఎక్కడ చూడు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్స్ జరుగుతున్నాయి. చిన్న చిల్లర దుకాణం దగ్గరి నుండి మాల్స్ వరకు ఎక్కడ చూడు UPI పేమెంట్స్ జరుగుతున్నాయి.

పేటీఎం, భీమ్‌ యాప్‌, గూగుల్‌ పేతో పాటు ఇతర పేమెంట్‌ యాప్‌లు, కెనరా బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. యూపీఐ లైట్‌ సేవలందిస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో సంభాషించడం ద్వారా యూపీఐతో చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి రావడం తో UPI ఆధారిత చెల్లింపులు ఎక్కువై పోయాయి. ఇప్పుడు ఈ UPI ఆధారిత చెల్లింపుల అంశాన్ని G20 వేదికగా ప్రపంచానికి చెప్పబోతోంది భారత్‌.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ నెల 09 నుండి G20 సమావేశాలు జరగబోతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా, చైనా సహా ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వేత్తలు హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో సమ్మిట్‌కు వచ్చే అందరికీ, మన దేశంలోని డిజిటల్ కెపాసిటీస్‌పై అవగాహన కల్పించడం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ (Aadhar), డిజీలాకర్ ‍‌(Digilocker), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి భారతదేశం సాధించిన డిజిటల్‌ అచీవ్‌మెంట్స్‌ గురించి G20 ప్రతినిధులకు చెప్పబోతోంది.

Read Also : Jagan Office Shifting : ఛ‌లో వైజాగ్…ముహూర్తం ఫిక్స్

ET రిపోర్ట్‌ ప్రకారం, సదస్సు సందర్భంగా ప్రతినిధులందరికీ UPI ద్వారా డబ్బు పంపాలని సెంట్రల్‌ గవర్నమెంట్‌ యోచిస్తోంది. జీ20 సదస్సులో 1000 మందికి పైగా డెలిగేట్స్‌ పాల్గొనే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. వాళ్లందరి కోసం కేంద్ర ప్రభుత్వం వాలెట్లను తయారు చేస్తోంది. సమ్మిట్‌ జరుగుతున్న సమయంలో, యూపీఐ ద్వారా ప్రతి ఒక్కరి వాలెట్‌కు వెయ్యి రూపాయలు బదిలీ చేయబోతున్నారు. శిఖరాగ్ర వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బును డెలిగేట్స్‌ ఉపయోగించుకోవచ్చు.

దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ ఎంత సులువుగా మారాయో ఇతర దేశాల నేతలు, అధికారులకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం.