Bharat Brand Phase II : కేంద్రంలోని మోడీ సర్కారు ‘భారత్ బ్రాండ్’ ఎంతోమందికి చేరువ అయింది. గతంలో ఎంతోమంది భారత్ బ్రాండ్ బియ్యం, గోధుమపిండి, శనగపప్పును కొనుగోలు చేశారు. మళ్లీ ఈరోజే (నవంబరు 5న) వాటి సేల్స్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ సంస్థల ద్వారా భారత్ బ్రాండ్ బియ్యం, గోధుమ పిండిని విక్రయించనున్నారు. బియ్యం, గోధుమలను 5 కేజీల, 10 కేజీల ప్యాకెట్ల రూపంలోనూ అందుబాటులో ఉంచారు. వినియోగదారులు కోరుకుంటే మరిన్ని చిన్న ప్యాకుల్లో సైతం వీటిని అందుబాటులోకి తెస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
Also Read :Sharad Pawar : రిటైర్మెంట్‌పై శరద్ పవార్ కీలక ప్రకటన.. పార్లమెంటరీ పాలిటిక్స్‌కు త్వరలో గుడ్‌బై
అయితే గతంతో పోలిస్తే ఈసారి ధరలను కొంతమేర పెంచారు. భారత్ బ్రాండ్ ఫేజ్-1లో కిలో గోధుమపిండిని రూ.27.5కే విక్రయించగా.. ఇప్పుడు దాన్ని రూ.30కి సేల్ చేయనున్నారు. భారత్ బ్రాండ్ ఫేజ్-1లో కిలో బియ్యాన్ని(Bharat Brand Phase II) రూ.29కే విక్రయించగా.. ఇప్పుడు దాన్ని రూ.34కు సేల్ చేయనున్నారు. అంటే ప్రతి కిలోకు రేట్లను సగటున మూడు నుంచి నాలుగు రూపాయల దాకా పెంచారు. భారత్ బ్రాండ్ రెండో దశలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఈ నిల్వలను ఇప్పటికే ఎఫ్‌సీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఈ స్టాక్ పూర్తయ్యే పరిస్థితి వస్తే.. అదనపు స్టాక్‌ను విక్రయాల కోసం రెడీ చేస్తారు.
Also Read :Raihan Vadra Gandhi : రాజకీయాల్లోకి రైహాన్ వాద్రా గాంధీ..? మేనమామ దగ్గరుండి నేర్పిస్తున్నాడా..?
సామాన్య ప్రజలకు ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో నిత్యావసరాలను కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తోంది. దీనివల్ల మార్కెట్లో నిత్యావసరాల ధరల పెరుగుదలకు కళ్లెం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భారత్ బ్రాండ్ తొలిదశలో భాగంగా 2023 అక్టోబర్ నుంచి 2024 జూన్ వరకు బియ్యం, గోధుమ పిండి, పప్పులను విక్రయించారు. ఫేజ్-1లో దాదాపు 15.20 లక్షల టన్నుల గోధుమలు, 14.58 లక్షల టన్నుల బియ్యాన్ని సేల్ చేశారు.