Madhya Pradesh: ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం

మధ్యప్రదేశ్‌లో మళ్ళీ బీజేపీ అధికారం చేపడితే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గిరిజనులు అధికంగా ఉండే అలీరాజ్‌పూర్‌ జిల్లాలో ఆయన పర్యటించారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మళ్ళీ బీజేపీ అధికారం చేపడితే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గిరిజనులు అధికంగా ఉండే అలీరాజ్‌పూర్‌ జిల్లాలో ఆయన పర్యటించారు. మధ్యప్రదేశ్ ప్రజల కష్టాలను తొలగించే నిర్ణయం తీసుకున్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. అప్పుడు ఎవరూ వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకే ముఖ్యమంత్రి అయ్యానని, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశానన్నారు. సీఎం హామీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి ప్రకటన యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత 18 ఏళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. భవిష్యత్తులో ఉద్యోగం ఎలా ఇస్తానని చెప్తున్నారు? నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేకే మిశ్రా ఆరోపించారు.

Also Read: Motha Mogiddam: మోత మోగించిన నారా భువనేశ్వరి