Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!

నేడు రాజభవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నత్ తమిళిసై (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR)పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో తాను కొందరికి నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ వాళ్లంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు. అందుకే వారి కోసం ఎంత వరకైనా కష్టపడతానని అన్నారు.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 08:57 AM IST

నేడు రాజభవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నత్ తమిళిసై (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR)పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో తాను కొందరికి నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ వాళ్లంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు. అందుకే వారి కోసం ఎంత వరకైనా కష్టపడతానని అన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. రాష్ట్ర అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుదని అన్నారు. గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు-నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటీస్ ఉండాలి’ అని అన్నారు. తానంటే కొంతమందికి నచ్చకపోవచ్చని కానీ తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని పేర్కొన్నారు.

Also Read: Harassment By BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామా

ముందుగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి అందరం కృషి చేయాలని కోరారు. కొత్త భవనాలు నిర్మించడం, ఫామ్‌హౌజ్‌లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, సగటువారి ఆకాంక్షలు నెరవేర్చాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని సీఎం కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు.