#Gopichand32: ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు శ్రీనువైట్ల హిట్ ఇచ్చేనా

హీరో గోపీచంద్‌ ప్రస్తుతం తన 31వ చిత్రం హర్ష దర్శకత్వంలో చేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - September 9, 2023 / 05:58 PM IST

హీరో గోపీచంద్‌ ప్రస్తుతం తన 31వ చిత్రం హర్ష దర్శకత్వంలో చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన కొత్త సినిమా ఈరోజు ప్రకటించారు. సక్సెస్ లేకుండా విరామం తీసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల #గోపీచంద్ 32తో జత కలిశాడు. ఇది వినోదాత్మక అంశాలతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. శ్రీను వైట్ల కొంతకాలంగా స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నాడు. గోపీచంద్‌ను డైనమిక్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ఈ హై-బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారు.

ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ నెలలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముహూర్తం షాట్‌కు కె రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ను వినిపించగా, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ కెమెరా స్విచాన్ చేశారు. #గోపీచంద్32లో ఎక్కువ భాగం విదేశీ లొకేషన్లలో చిత్రీకరించబడుతుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, కెవి గుహన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Also Read: Chandrababu Arrest: చంద్రబాబు కోసం పవన్ .. అనుమతి నిరాకరణ