Site icon HashtagU Telugu

Job Layoff’s: గూగుల్, అమెజాన్ జాబ్ కట్స్..! ఏడాది శాలరీ ఇచ్చి మరీ తొలగింపు

Highest Salary

Google, Amazon Job Cuts..! One Year's Salary And Many Layoffs

Job Layoff’s : ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలకు హబ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ. గూగుల్, మెటా, అమెజాన్ సహా 570 టెక్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఇప్పటివరకు 1,68,918 మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగించాయి. ఈ తొలగింపులకు బ్రేకులు పడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు యూరప్‌లోనూ జాబ్ కట్స్ (Job Layoff’s) చేయడంపై ఇవి ఫోకస్ చేస్తున్నాయి. తమ ఉద్యోగులను మరింత తగ్గించాలని చూస్తున్నాయి. అయితే కొన్ని యూరప్ దేశాలలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించకుండా చట్టపరమైన రక్షణలు ఉన్నాయి. అటువంటి చోట కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేయడానికి ముందు చట్టబద్ధంగా కౌన్సిల్‌లతో సంప్రదించవలసి ఉంటుంది. ఇందులో డేటా సేకరణ, చర్చలు , అప్పీల్ చేసే ఎంపికయొక్క సంభావ్య సమయం తీసుకునే ప్రక్రియ ఉంటాయి.  ఫ్రాన్స్ , జర్మనీలలో జాబ్ కట్స్ విషయంలో టెక్ కంపెనీలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. త్వరగా ఈ తొలగింపుల ఆటంకాలను పరిష్కరించడానికి Google న్యాయ నిపుణుల సహాయం కోరుతోంది.

ఫ్రాన్స్ లో..

ఒక నివేదిక ప్రకారం.. ఫ్రాన్స్‌లో గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కొందరు ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరుతోంది. ప్రతిఫలంగా మంచి ప్యాకేజీలను తీసుకోవాలని చెబుతోంది. 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే.. వారికి ఒక ల్సంవత్సరం వేతనంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీని అమెజాన్ అందజేస్తోందని ఆ నివేదిక వెల్లడించింది. కంపెనీ నుంచి వెళ్లిపోయే కొందరు ఉద్యోగులకు ల్ఇప్పటికే కేటాయించిన షేర్లను లిక్విడ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఇస్తామని తెలిపింది. షేర్లను లిక్విడ్ గా మార్చి బోనస్‌లుగానూ చెల్లిస్తామని పేర్కొంది.

జర్మనీలో..

ఇక జర్మనీలో అమెజాన్ కంపెనీ ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించి, స్వచ్ఛందంగా రాజీనామా చేసే వారికి అవకాశాన్ని అందిస్తోంది. కార్మిక రక్షణలు అంత కఠినంగా లేని UKలో 8,000 మంది Google ఉద్యోగులలో 500 మందిని తొలగించారు. ఇందుకు అదనంగా డబ్లిన్, జ్యూరిచ్‌ లలో కొంతమంది ఉద్యోగులను తొలగించాలని కూడా గూగుల్ చూస్తోంది.అక్కడ కూడా తొలగించే ఉద్యోగుల సంఖ్య 200 కంటే ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది.

Also Read:  Telangana Pending Bills: పెండింగ్ బిల్లులపై సుప్రీంకు వివరణ ఇచ్చిన గవర్నర్