Site icon HashtagU Telugu

Nalgonda : నల్గొండ లో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు..పలు రైళ్ల నిలిపివేత

Goods Train

Goods Train

నల్గొండ (Nalgonda ) జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడం తో ఆ రూట్ లో వెళ్లే పలు రైళ్లను నిలిపివేశారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో రెండు బోగీలు పట్టాల నుంచి తప్పిపోయాయి. రైలు పట్టాలు తప్పిన సమయంలో మిగతా బోగీలు పడిపోకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. తక్కువ వేగంతో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రమాదం కారణంగా గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. శబరి ఎక్స్​ప్రెస్​ను మిర్యాలగూడ వద్ద, జన్మభూమి ఎక్స్​ప్రెస్​ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు. అయితే, గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

Read Also : MILK : ఆవు పాలు – గేదె పాలు.. మానవ శరీరానికి ఏది మంచిది..?