Site icon HashtagU Telugu

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 4.9 శాతం డీఏ మంజూరు

Tsrtc Buses Imresizer

Tsrtc Buses Imresizer

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ప్రకటన ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడా లేని ఆనందం నింపింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read: Dashabdi Utsavalu: తెలంగాణ ‘దశాబ్ది’ ఉత్సవాలు దద్ధరిల్లేలా!