Site icon HashtagU Telugu

Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!

Gold Rate In India

Gold Rate In India

Gold Price Today : భారతీయులు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను ఆర్థిక భరోసాగా భావిస్తారు. మహిళలు ముఖ్యంగా ఆభరణాలుగా వాటిని ధరిస్తారు. పెళ్లిళ్లు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి ఉండటం సంప్రదాయంగా మారింది. ఈ కారణంగా ఈ సమయాల్లో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం దిగుమతులలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏడాది టన్నుల కొద్దీ బంగారం మన దేశానికి దిగుమతి అవుతుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ , పండగల సీజన్ కొనసాగుతుండటంతో బంగారం కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి.

Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంట‌లు.. మ‌నోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు

ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 30 డాలర్ల మేర పెరిగి $2700 స్థాయికి చేరింది. అదే సమయంలో, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $2 పెరిగి $32.02 వద్ద స్థిరపడింది. మరోవైపు, రూపాయి విలువ పతనమై డాలర్‌తో పోల్చితే ₹84.858 వద్దకు పడిపోయింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు ₹750 పెరిగి ₹72,050 వద్దకు చేరుకుంది.
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు ₹820 పెరిగి ₹78,600 స్థాయికి ఎగబాకింది.
ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.

వెండి ధర కిలోకు ₹4000 మేర పెరిగి ₹1,04,000 వద్దకు చేరింది.
ఇది ఇటీవలి కాలంలోనే అత్యధిక రేటుగా చెప్పవచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న ధరలు డిసెంబర్ 11, బుధవారం ఉదయం 7 గంటల వరకు మాత్రమే అమలులో ఉన్నాయి. మధ్యాహ్నం తరువాత ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కనుక కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను తెలుసుకోవడం ఉత్తమం.)

 Shut Govt Offices: కాలుష్యం కారణంగా పాఠ‌శాల‌లు, కార్యాల‌యాలు మూసివేత.. ఎక్క‌డంటే?