Site icon HashtagU Telugu

Gold & Silver: చుక్కులు చూపిస్తున్న బంగారం ధ‌ర‌లు.. రూ. 70 వేలు దాటిన గోల్డ్ రేట్‌..!

Gold Price

Gold Price

Gold & Silver: మీరు కూడా బంగారం లేదా వెండి (Gold & Silver)ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ రోజు బంగారం సరికొత్త ఆల్-టైమ్ హై రికార్డ్‌ను సృష్టించింది. అవును.. బంగారం ధర ఈరోజు రూ.70 వేలు దాటింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగింది. మరోవైపు గత కొన్ని రోజులుగా వెండి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈరోజు వెండి ధర 1000 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత వెండి కిలో 82000 రూపాయలకు చేరుకుంది. నేటి తాజా రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

24, 22, 18 క్యారెట్ల బంగారం ధర..?

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70,470కి చేరుకుంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.64,600గా కొనసాగుతోంది. కాగా 18 క్యారెట్ల బంగారం ధర రూ.410 పెరిగి, ఆ తర్వాత ధర రూ.52,850కి చేరింది.

వెండి తాజా ధర

వెండి గురించి మాట్లాడితే.. జాతీయ స్థాయిలో వెండి ధర 1000 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత వెండి ధర కిలోకు 82000 రూపాయలుగా ఉంది. నిన్న వెండి కిలో ధర 81000 రూపాయలుగా ఉంది.

Also Read: Heatwave: ఈ రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించిన భార‌త వాతావ‌ర‌ణ విభాగం.. ఎందుకంటే..?

నాలుగు పెద్ద నగరాల్లో బంగారం ధర

నగరం – 22K రేటు – 24K రేటు – 18K

– చెన్నై- రూ. 65,450- రూ. 71,400- 10 గ్రాములకు రూ. 53,610
– ముంబై- రూ. 64,600- 70,470- 10 గ్రాములకు 52,850
– ఢిల్లీ- రూ. 64,750- 70,620- 10 గ్రాములకు రూ 52,980
– కోల్‌కతా- రూ. 64,600- 70,470- 10 గ్రాములకు రూ 52,850
– హైదరాబాద్- రూ. 64,600 – 70,470 – 52,850

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని వేగంగా కొనుగోలు చేయడమే బంగారం ధరల పెరుగుదలకు కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో 2024లో ప్రపంచం మొత్తం మాంద్యం రావచ్చని కొందరు అంటున్నారు. మరోవైపు క్రిప్టో పెరుగుదల కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతోంది. బంగారంతో పోలిస్తే వెండి అంతగా పెరగలేదు.

We’re now on WhatsApp : Click to Join