Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్త శాంతించాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,840గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 08:05 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్త శాంతించాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,840గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 76,000 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (మార్చి 26, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,990గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,840 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,890గా ఉంది.

Also Read: Business Idea : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం. ఈ వ్యాపారానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది.నెలకు 15లక్షలు సంపాదించవచ్చు.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,300 ఉండగా, ముంబైలో రూ.73,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కోల్‌కతాలో రూ.73,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కేరళలో రూ.76,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.