Site icon HashtagU Telugu

Hyderabad Gold Price: హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today

Hyderbad Gold Price

Hyderabad Gold Price: నగరంలో బంగారం స్వల్పంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు నివేదించాయి. గడిచిన మూడు రోజుల నుంచి సుమారు రూ. 1150 వరకు బంగారం ధర పెరిగింది. నిన్నటితో పోలిస్తే మరోసారి రూ. 400 వరకు పెరిగింది. దీన్ని బట్టి బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఈరోజు ధరల ప్రకారం చూస్తే బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,150 పెంపుతో రూ. 400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,980 పెంపుతో రూ. 440 గా ఉంది. బంగారం ధరతో పోలిస్తే.. వెండి రేటులో పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదు. వెండి విషయానికొస్తే, హైదరాబాద్లో వెండి ధర రూ. కిలోకు 75,000 కు చేరింది. గత వారంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది ఇంకెంత పెరుగుతుందో చూడాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు రూ. 60,000 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మరియు సుమారు రూ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,000 గా ఉంది.

Also Read: 5 States – Number Game : ఐదు రాష్ట్రాల పొలిటికల్ పంచాంగం.. నంబర్ గేమ్ లో నెగ్గేదెవరు ?